చిత్తూరు జిల్లా ములకలచెరువు మండలం కనుగొండవారిపల్లిలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పవన్ అనే యువకుడు దానిమ్మతోటలో కూలి పనులకు వెళ్లి విద్యుదాఘాతంతో మృతి చెందాడు. బోరు మోటర్ తీగ పక్కకు తీస్తుండగా ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. మృతుడు పవన్ ఇటీవలే ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. తమ ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందటంతో పవన్ తల్లిందండ్రుల రోదనలు మిన్నంటాయి.
ఇదీచదవండి