ETV Bharat / state

మంచినీటి కోసం దయ్యాలగుంట మహిళలు ధర్నా

తాగునీటి కోసం దయ్యాలగుంట మహిళలు ధర్నాకు దిగారు. ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

author img

By

Published : Aug 24, 2019, 1:11 PM IST

womens-darna-for-water-in-chittoor-in-andhrapradesh
మంచినీటి కోసం దయ్యాలగుంట మహిళలు ధర్నా

చిత్తూరు జిల్లా పుత్తూరు మున్సిపాలిటీలోని దయ్యాలగుంట మహిళలు.. తాగునీటి కోసం ధర్నా నిర్వహించారు. ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. వారం రోజులుగా తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని... మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ట్యాంకర్లు ఏర్పాటు చేస్తామని మున్సిపల్ అధికారులు హామీ ఇవ్వగా.. ధర్నాను విరమించారు.

Intro:నోట్ ఈ వార్తను ఈటీవీ ఆంధ్ర ప్రదేశ్ కు పంపగలరు
కంట్రీ బ్యూటర్: కె శ్రీనివాసులు
సెంటర్: కదిరి
జిల్లా : అనంతపురం

Ap_Atp_46_14_Ramaneeyam_Ramulori_Kalyanam_AV_C8

Body:శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా అనంతపురం జిల్లా కదిరి పరిసరాలలోని ఆలయాలు నామస్మరణతో మార్మోగాయి. కదిరి పట్టణం లోని పంచముఖ ఆంజనేయ స్వామి, గరుడ ఆంజనేయ స్వామి, రామాలయం, కుటాగుళ్లతో పాటు , గాండ్లపెంట, తలుపుల ,నల్లచెరువు మండలాలల్లోని గ్రామాలు రామనామస్మరణతో మార్మోగాయి . పంచముఖ ఆంజనేయ స్వామి నిర్వహించిన సీతారాముల కళ్యాణ వేడుకను శ్రీఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ప్రధాన అర్చకులు నరసింహాచార్యులు నిర్వహించారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ శంకరయ్య స్వామివారి కల్యాణానికి అవసరమైన ఏర్పాట్లనుచేశారు. సీతారాముల కళ్యాణాన్ని తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. రాములోరి కళ్యాణ వేడుకల్లో హోమాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.