చిత్తూరు జిల్లా నత్తం కండ్రిగలో విషాద ఘటన జరిగింది. వరకట్న వేధింపులతో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల కథనం ప్రకారం.. నత్తం కండ్రిగకు చెందిన సతీష్‌కు నారాయణవనానికి చెందిన మీనాతో 2001లో వివాహం జరిగింది. వీరికి నాలుగేళ్ల కుమారుడున్నాడు. సతీష్ ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు.
రెండు సంవత్సరాలుగా అదనపు కట్నం తేవాలంటూ అతను తన భార్యను అడుగుతున్నాడు. ఈ విషయంలో శనివారం భార్యాభర్తలు మరోసారి గొడవ పడ్డారు. అనంతరం సతీశ్ ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయాడు. ఇంట్లో ఎవరూ లేకపోవటంతో మీనా ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు వెల్లడించారు. ఆమె తండ్రి నాగిరెడ్డి ఫిర్యాదు మేరకు... వరకట్న వేధింపు చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. సతీష్‌ని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.
ఇదీ చదవండి: