ETV Bharat / state

వాట్సాప్​ గడ్డ.. సైబర్​ నేరగాళ్ల నూతన అడ్డా!!

CYBER CHEATING THROUGH WHATS APP : ముఖ్యమైన సమావేశంలో ఉన్నా.. ఫోను మాట్లాడలేను.. అర్జెంట్‌గా ఈ ఖాతాకు నాకు డబ్బు పంపించగలవు అని మీ పై అధికారో, స్నేహితులో, కుటుంబ సభ్యులో వాట్సాప్‌లో మెసేజ్‌ పెడితే.. ఏమాత్రం ఆలోచించకుండా డబ్బులు పంపారో.. మీరు సైబర్ నేరగాళ్ల చేతిలో బలైనట్లే. ఇన్నాళ్లు ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రా, ట్విటర్లకే పరిమితమైన నకిలీ ఖాతాల మోసాలు వాట్సాప్‌కూ పాకింది.

CYBER CHEATING THROUGH WHATS APP
CYBER CHEATING THROUGH WHATS APP
author img

By

Published : Nov 14, 2022, 12:01 PM IST

వాట్సాప్​ గడ్డ.. సైబర్​ నేరగాళ్లకు నూతన అడ్డా!!

CYBER CHEATING : మీకు నెల నెల జీతమిచ్చే మీ యాజమానే...అత్యవసరమని మిమ్మల్ని డబ్బు అడగవచ్చు. మీరు ఎంతగానే అభిమానించే నాయకుడి నుంచే 50 వేలు కావాలంటూ సందేశం రావచ్చు. అదేంటి వాళ్లు మమ్మల్ని ఎందుకు అడుగుతారనే కదా మీ సందేహం. రాజ్‌భవన్‌లో పనిచేసే ఉద్యోగిని ఏకంగా గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ సాయం కోరగా లేనిది.. మీకు తెలిసిన పెద్దలు డబ్బు పంపించమని వాట్సాప్‌లో అడగడంలో వింతేముంది చెప్పండి.

అందివచ్చిన సాంకేతికతను వాడుకుంటూ ఎప్పటికప్పుడూ సరికొత్త నేరాలకు తెర తీసే సైబర్ మోసగాళ్లు.. తాజాగా వాట్సాప్‌ను తమ నయా అస్త్రంగా ఎంచుకుంటున్నారు. ప్రముఖులు, రాజకీయ నాయకులు, అధికారులు తదితరుల ఫొటోల నకిలీ ఖాతాలతో డబ్బు కావాలనే సందేశాలు పంపిస్తూ బురిడీ కొట్టిస్తున్నారు. రాజ్‌భవన్‌లో పనిచేసే ఓ ఉద్యోగికి గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఫొటో, పేరు ఉన్న ఒక నెంబరు నుంచి వాట్సాప్‌ సందేశం రాగా.. అధికారులు ఆరా తీయగా ఆ నంబర్‌ రాజస్థాన్‌లో ఉన్నట్లు తేలింది. గుంటూరులో విధులు నిర్వహిస్తున్న ఓ యువ ఐఏఎస్‌ అధికారి వాట్సాప్‌ ఖాతా నుంచి 20 వేలు కావాలంటూ కొంతమందికి సందేశాలు రావడం, వాళ్లు డబ్బు పంపించడం, సైబర్ నేరగాళ్ల పని అని ఆ తరువాత గుర్తించడం జరిగింది .

తెలంగాణ, పంజాబ్, కేరళ, గోవా, తదితర రాష్ట్రాల్లో నకిలీ వాట్సాప్‌ ఖాతాలతో మోసాలకు పాల్పడుతున్న ఘటనలు నమోదు అవుతున్నాయి. ఈ తరహా మోసాల్లో ఫొటోలు, పేర్లు అసలువే అయినా.. ఫోన్‌ నెంబర్లు మాత్రం అమాయకులవి కావడం విశేషం. ఇలాంటి సందేశాలు వస్తే వెంటనే డబ్బులు పంపక, ఒకటికి రెండు సార్లు నిర్ధరించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు .

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.