అనుమానాస్పద స్థితిలో వీఆర్వో మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లా బుచ్చినాయుడు కండ్రిగలో జరిగింది. శ్రీకాళహస్తికి చెందిన మునెయ్య.. బుచ్చినాయుడు కండ్రిగలో వీఆర్వోగా విధులు నిర్వహించేవారు. మంగళవారం సాయంత్రం బుచ్చినాయుడు కండ్రిగ సమీపంలో రోడ్డు పక్కన పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు.. 108 వాహనానికి సమాచారం అందించారు. చికిత్స నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా... ఆయన మృతి చెందారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండీ... శ్రీకాళహస్తిలో అనధికార విగ్రహాలు: నిందితుల అరెస్టు