శ్రీవారి సేవలో ప్రముఖులు - hero nikhil at tirumala
తిరుమల శ్రీవారిని మాజీ ఎంపీ వివేక్, ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ ఛైర్మన్ కారెం శివాజీ, హీరో నిఖిల్, దర్శకుడు చందూ మెుండేటి దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్ ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకం, ఈ ఉగాదికి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయని శివాజీ అన్నారు. దేవాలయాల గొప్పతనాన్ని తెలియజేసే విధంగా కార్తికేయ-2 చిత్రం ఉంటుందని కథానాయకుడు నిఖిల్ అన్నారు.