చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం మల్లయ్యపల్లిలో నాటు కోళ్లు మృతి చెందడంపై వెటర్నరీ డాక్టర్లు ఆ గ్రామాన్ని సందర్శించారు. చంద్రగిరి వెటర్నరీ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ వీ.రమణ కుమార్, మల్లయ్యపల్లి వెటర్నరీ డాక్టర్ వినోద్ కుమార్ గ్రామంలోని నాటు కోళ్లు మృతిచెందిన ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరించి.. కోళ్లను పరీక్షించారు. గ్రామ పరిసర ప్రాంతాలను కలియతిరిగారు. పంట పొలాలకు వేసిన మందుల వల్లనే ఇవి మృతి చెందాయి అని వైద్యులు నిర్ధారించారు. గ్రామస్థుల్లో ఉన్న అనుమానాలు తొలగిస్తూ ఈ కోళ్ల మృతికి బర్డ్ ఫ్లూ కారణం కాదని.. పంట పొలాలపై వేసిన మందుల వల్ల అక్కడ మేతకు వెళ్లి తిని చని పోతున్నాయని వెల్లడించారు. ఈ ప్రాంతంలో బర్డ్ ఫ్లూ లేదని ప్రజలు భయపడాల్సిన పని లేదని డాక్టర్లు తెలిపారు.
ఇదీ చదవండి: విదేశీ పక్షుల పరిరక్షణకై 9న నేలపట్టులో ప్రత్యేక అవగాహన సదస్సు