కరోనాతో కరువు తాండవిస్తున్న సమయంలో గ్రామీణ ప్రాంత ప్రజలకు.... ఉపాధి హామీ పనులు చేదోడుగా నిలిచాయి. దేశంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా అన్ని రకాల పరిశ్రమలు కుదేలవడంతో కార్మికులు రోడ్డున పడ్డారు. ఇటువంటి సమయంలో సామన్య ప్రజలకు కూలీ దొరకని పరిస్థితి ఏర్పడింది. ఆకలితో అలమటిస్తున్న ప్రజలకు ఉపాధి హామీతో జీవనం పొంది కడుపు నింపుకుంటున్నారు. కరోనా ఉద్ధృతి తగ్గే వరకు పని దినాలను పెంచాలని ఉపాధి హామీ కూలీలు వేడుకుంటున్నారు.
ఇదీ చదవండి: భారత గగనతలంలోకి పాక్ డ్రోన్.. కూల్చిన భద్రతా దళాలు