ప్రభుత్వ సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో పేదలకు అందించాలన్న ఉన్నతమైన ఆశయంతో రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చింది. వీరిపై అదే పార్టీకి చెందిన కొందరు నాయకులు వేధింపులకు పాల్పడటం, పైరవీలు చేయడం వంటివి చేస్తుండటంతో వాలంటీర్లు మానసిక వేధింపులకు గురై రాజీనామాలు చేస్తున్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం అంకిశెట్టిపల్లి పంచాయతీలో వైకాపా నాయకుడి వేధింపులు తట్టుకోలేక ఇద్దరు వాలంటీర్లు రాజీనామా లేఖలను ఎంపీడీవోకు అందజేశారు.
ఇవీ చదవండి...లాక్డౌన్ కాలంలో మానసిక ఒత్తిడిని అధిగమించటం ఎలా?