తిరుపతిలో తితిదే నిర్వహిస్తున్న పాఠశాలలను బుధవారం తితిదే జేఈవో (విద్య, ఆరోగ్యం) ఎస్.భార్గవి తనిఖీ చేశారు. ఎస్వీ ఉన్నత పాఠశాల, ఎస్వీ బదిర పాఠశాల, శ్రీ పద్మావతి బాలికల ఉన్నత పాఠశాల, శ్రీ కోదండరామస్వామి ఇంగ్లీషు మీడియం హైస్కూల్, తాటి తోపులోని శ్రీ కపిలేశ్వరస్వామి ఉన్నత పాఠశాలలను జేఈవో తనిఖీ చేశారు.
కరోనా నేపథ్యంలో ..
త్వరలో పాఠశాలలు పునఃప్రారంభం కానుండటం వల్ల కొవిడ్-19 నేపథ్యంలో ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా చేపట్టాల్సిన ఏర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. తరగతి గదుల్లో భౌతిక దూరం పాటించేలా మార్కింగ్ చేయాలని జేఈఓ సూచించారు.
వెంటనే మరమ్మతులు..
హాస్టళ్లు తెరిచిన అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా అధికారులతో చర్చించారు. అన్ని పాఠశాల భవనాల్లో మరుగుదొడ్లు, మురుగునీటి కాల్వలు, స్విచ్ బోర్డులు, నీటి కుళాయిలను పరిశీలించారు. అవసరమైన చోట్ల వెంటనే సివిల్, ఎలక్ట్రికల్, వాటర్ వర్క్స్ మరమ్మతులు చేపట్టాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
ఇవీ చూడండి : 'అమరావతి'పై వాదనలు.. రిట్ పిటిషన్ల విభజనకు హై కోర్టు ఆదేశం