ఆర్జిత సేవల కుంభకోణం కేసులో ఆరుగురు ఉద్యోగులను తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో జవహర్ రెడ్డి తొలగించారు. స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈవోపై చర్యలకు ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. శాఖాపరమైన విచారణ ఆధారంగా ఇప్పుడు ఏడుగురిపై తితిదే చర్యలు తీసుకుంది.
పలు ఆర్జిత సేవా టికెట్లను 30 ఏళ్లకు విక్రయించినట్లు ఆ ఉద్యోగులపై ఆరోపణలు వచ్చాయి.
2006-08లో ఆర్జిత సేవా టిక్కెట్ల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. అప్పట్లో 14 మందిపై కేసులు పెట్టి పలు కమిటీలతో తితిదే విచారణ చేయించింది.
ఇదీ చదవండి: TTD Tickets: తితిదే వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్య.. దర్శన టికెట్ల విడుదలలో జాప్యం