భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని తిరుమల శ్రీవారి దర్శనాలను కొనసాగిస్తున్నామని.. ఆదాయం కోసం మాత్రం కాదని తితిదే ఈవో అనిల్ కుమార్ సింఘాల్ స్పష్టంచేశారు. తితిదే పరిపాలన భవనంలో మీడియాతో మాట్లాడారు.
తితిదే ఉద్యోగుల్లో 743 మందికి కరోనా సోకినట్టుగా నిర్ధరణ అయిందని వీరిలో 402 మంది కోలుకున్నారని తెలిపారు. ఆదాయం కోసమే దర్శనాలను కొనసాగిస్తున్నామంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. శ్రీవారిని దర్శించుకోవాలన్న భక్తుల కోరిక మేరకే దర్శనాలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
స్వామివారి ఆలయ నిర్వహణ ఖర్చుతో పోలిస్తే దర్శనాల ద్వారా వచ్చే ఆదాయం స్వల్పమని ఈవో అన్నారు. ఉత్తరాది భక్తులకు తితిదే సమాచారాన్ని మరింత చేరువ చేయడానికి ఎస్వీబీసీ హిందీ ఛానల్ ప్రారంభించబోతున్నామన్నారు. తిరుపతిలో నిలిపివేసిన సర్వదర్శనం టోకెన్ల జారీని త్వరలో పునరుద్దరిస్తామని చెప్పారు.
ఇవీ చదవండి: