తిరుమల శ్రీవారి ఆలయానికి పక్కనే ఉన్న శ్రీవారాహల లక్ష్మినరసింహస్వామి ఆలయంలో మహాసంప్రోక్షణ నేపథ్యంలో శ్రీవారి దర్శనాన్ని 5 గంటల పాటు నిలిపివేశారు. ఉదయం 11.07 గంటల నుంచి మధ్యాహ్నం 1.16 గంటల వరకు మహాసంప్రోక్షణ క్రతువు జరగనుంది. అనంతరం నిత్యకైంకర్యాల్లో భాగంగా తోమాల, అర్చన, నైవేద్యం... రెండో గంటలో పూజాదికాలు నిర్వహించనున్నారు. ఇదే సమయంలో శ్రీవారి ఆలయంలో కైంకర్యాలు జరగనున్నాయి. ఈసందర్భంగా శ్రీవారి దర్శనాన్ని 5గంటల పాటు తితిదే రద్దు చేసింది. కల్యాణోత్సం, ఆర్జిక బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ సేవలను రద్దుచేసింది. ఉదయం 10 నుంచి 11 గంటల వరకు మహాపూర్ణాహుతి నిర్వహిస్తారు. మహాసంప్రోక్షణలో భాగంగా యాగశాలలో కుంభంలో ఉన్న దేవతామూర్తుల శక్తిని బింబంలోకి ఆహ్వానిస్తారు. వైదిక కార్యక్రమంతో శ్రీవరాహస్వామి, శ్రీ విష్వక్సేనులవారు, శ్రీ రామానుజాచార్యులు, పుష్కరిణి వద్ద గల శ్రీ ఆంజనేయస్వామివారి విగ్రహాలకు దైవశక్తి చేకూరుతుంది.
నేడు 5 గంటల పాటు శ్రీవారి దర్శనం నిలిపివేత - piligrims
తిరుమల శ్రీవారి ఆలయంలో ఇవాళ 5 గంటలపాటు శ్రీవారి దర్శనం నిలిపివేయనున్నారు. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల 30 నిమిషాల వరకు.. దాదాపు 5 గంటలపాటు తితిదే భక్తులకు దర్శనాన్ని నిలిపివేయనుంది.