ETV Bharat / state

8న.. అన్నమాచార్య 518వ వర్ధంతి నిర్వహణకు తితిదే ఏర్పాట్లు - అన్నమాచార్య వర్ధంతికి తాజా వార్తలు

అన్నమాచార్య 518వ వర్ధంతిని నిర్వహించేందుకు తితిదే ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్యక్రమంలో అన్నమాచార్య గురుపరంపరకు చెందిన అహోబిల మఠం 46వ పీఠాధిపతి శ్రీమాన్‌ శ్రీవణ్‌ శఠగోప శ్రీరంగనాథ యతీంద్ర మహాదేశికన్‌ స్వామీ.. ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

518th death anniversary
అన్నమాచార్య 518వ వర్ధంతికి తితిదే ఏర్పాట్లు
author img

By

Published : Apr 6, 2021, 6:14 PM IST

పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల వర్ధంతిని నిర్వహించేందుకు తితిదే ఏర్పాట్లు చేస్తోంది. ఏప్రిల్ 8న అన్నమాచార్య 518వ వర్ధంతి. తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో సప్తగిరి సంకీర్తనా గోష్టిగానం నిర్వహించనున్నారు. శ్రీవారి ఆలయం నుంచి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఊరేగింపుగా బయలుదేరి సాయంత్రం 6.00 గంటలకు నారాయణగిరి ఉద్యానవనాలకు చేరుకుంటారు.

అక్కడ స్వామి, అమ్మవార్లకు ఊంజల్‌ సేవ నిర్వహించిన అనంతరం.. అన్నమయ్య రచించిన భక్తిగీతాలను కళాకారులు ఆలపిస్తారు. అన్నమాచార్య గురు పరంపరకు చెందిన అహోబిల మఠం 46వ పీఠాధిపతి శ్రీమాన్‌ శ్రీవణ్‌ శఠగోప శ్రీరంగనాథ యతీంద్ర మహాదేశికన్‌ స్వామీజీ వేడుకల్లో పాల్గొననున్నారు.

ఇవీ చూడండి:

ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని దుస్థితిలో రాష్ట్రం ఉంది

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.