స్వర్ణముఖి నదిలో వైభవంగా త్రిశూల స్నానం మాఘ పౌర్ణమిని పురస్కరించుకొని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో సద్యోముక్తి వ్రతం వైభవంగా నిర్వహించారు. ముక్కంటి ఆలయం నుంచి వినాయక స్వామి, శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి, సోమస్కందమూర్తి, జ్ఞానప్రసూనాంబదేవి, చండికేశ్వరస్వామి ఉత్సవ మూర్తులతో పాటు ఉమాదేవి సమేత చంద్రశేఖర స్వామి కొలువు దీరిన త్రిశూలాన్ని పండితులు మాఢ వీధుల్లో ఊరేగిస్తూ స్వర్ణముఖి నది వద్దకు తీసుకువచ్చారు. అనంతరం స్వర్ణముఖి నదిలో త్రిశూల స్నానం నిర్వహించారు. ఈ ఉత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్బంగా ఉత్సవ విశిష్టతను అర్చకులు భక్తులకు వివరించారు.
ఇదీ చదవండి:
పోషణ కోసం వలసవెళ్లారు.. గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్నారు