TRISULA SNANAM AT SRIKALAHASTI : మాఘ పౌర్ణమిని పురస్కరించుకుని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఘనంగా త్రిశూల స్నానం నిర్వహించారు. సోమస్కందమూర్తి సమేత శ్రీ జ్ఞాన ప్రసూనాంబదేవి, ఉమాదేవి సమేత చంద్రశేఖర స్వామి కొలువుదీరిన త్రిశూలం, వినాయక స్వామి, సుబ్రహ్మణ్యం స్వామివారిని ఉత్సవ మూర్తులుగా ఆలయం నుంచి స్వర్ణముఖి నది వద్దకు తీసుకువచ్చారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య హోమ పూజలు నిర్వహించారు. సద్యోముక్తి వ్రతం గురించి వేద పండితులు ప్రవచనం చేశారు. అనంతరం నదిలో త్రిశూల స్నానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు తరలిరావటంతో... స్వర్ణముఖి నది తీరం భక్తజన సంద్రంగా మారింది.
ఇదీ చదవండి