చిత్తూరు జిల్లాలోని తిరుపతి గంగమ్మ జాతర వరుసగా రెండో ఏడాది నిరాడంబరంగా ముగిసింది. జాతర చివరి రోజైన ఇవాళ అమ్మవారికి విశేషంగా అలంకరించారు. ఏటా జాతర సమయంలో జిల్లా నుంచే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి తరలివచ్చే భక్తులతో కిటకిటలాడే ఆలయ ప్రాంగణం ఈ సారి కూడా బోసిపోయింది. తిరుమల శ్రీవారి సోదరిగా పూజలందుకునే అమ్మవారి జాతరలో చివరి రోజు ముగిసిన తర్వాత నిర్వహించే విశ్వరూపం కార్యక్రమాన్ని ఏకాంతంగానే నిర్వహించనున్నట్లు ఆలయ పాలకవర్గం తెలిపింది.
ఏటా విశ్వరూపం సమయంలో అమ్మవారి మన్నును తీసుకునేందుకు వేల సంఖ్యలో భక్తులు తరలిరావటం ఆనవాయితీగా ఉండేది. అయితే ఈసారి నెలకొన్న కరోనా విపత్కర పరిస్థితుల నేపథ్యంలో… జాతరను ఏకాంతంగా పూర్తి చేయాలని ఆలయ పాలకవర్గం నిర్ణయించింది. అమ్మవారికి ఎలాంటి లోటు రాకుండా పూజలు నిర్వహించటంతో పాటు ప్రస్తుతం నెలకొన్న కఠిన పరిస్థితులు త్వరగా తొలిగిపోవాలని వేడుకున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: