తిరుపతి వేదికగా నేటి నుంచి నాలుగు రోజుల పాటు స్టేట్ పోలీస్ డ్యూటీ మీట్‌ను నిర్వహించనున్నారు. సీఎం జగన్ ఈ కార్యక్రమాన్ని వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. సైబర్ క్రైమ్, మహిళా భద్రత వంటి సామాజిక అవగాహనా అంశాలపైనా ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు సింపోజియంల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించనున్నారు. సాంకేతిక అభివృద్ధి కోసం ఐఐటీ,ఐసర్ వంటి జాతీయ స్థాయి విద్యాసంస్థలతో ఒప్పందాలు సహా..... రాష్ట్ర పునర్విభజన తర్వాత తొలిసారిగా జరుగుతున్న స్టేట్ పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహణను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నట్లు చెబుతున్న తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డితో ఈటీవీ భారత్ ముఖాముఖి.
'రాష్ట్ర విభజన తరువాత మెుదటి సారిగా స్టేట్ పోలీస్ డ్యూడీ మీట్ తిరుపతిలో నిర్వహించటం గర్వంగా ఉంది. ఇందుకు తగ్గ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాము. 22 విభాగాల్లో పోలీసు సిబ్బంది తమ నైపుణ్యాలను ప్రదర్శించనున్నారు. - రమేష్ రెడ్డి తిరుపతి అర్బన్ ఎస్పీ.
ఇదీ చదవండి: నేటి నుంచి ‘ఏపీ పోలీస్ డ్యూటీ మీట్’.. ప్రారంభించనున్న సీఎం