తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశం ఇవాళ జరగనుంది. కరోనా తీవ్రత తగ్గుతున్న నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి అనుమతించే భక్తుల సంఖ్య పెంచడంతో పాటు 85 అంశాలపై చర్చించనున్నారు. తిరుపతిలో వాహన రద్దీని నియంత్రించేందుకు గరుడ వారధి నిర్మాణాలను అలిపిరి కూడలి వరకూ విస్తరించడం, వరాహస్వామి ఆలయ వెండి వాహిలి నిర్మాణానికి 180 కిలోల వెండి కేటాయింపుపైనా చర్చించనున్నారు. తిరుమలలో కొత్తగా 13 వందల 89 సీసీ కెమేరాల ఏర్పాటు వంటి కీలక అంశాలపై నిర్ణయం తీసుకోనున్నారు. తితిదే ధర్మకర్తల మండలి రెండు సంవత్సరాల పదవీ కాలం ఈనెల 21తో ముగియనున్న నేపథ్యంలో ఇవాళ జరగనున్న సమావేశమే ప్రస్తుత ధర్మకర్తల మండలికి చివరి భేటీ కానుంది. ఈ సమావేశంలో గడచిన మూడు నెలల కాలంలో కొనుగోలు చేసిన నిత్యావసరాల చెల్లింపులకు ఆమోదముద్ర వేయనున్నారు.
ఇవీ చదవండి