చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె మండలం పెద్దమండ్యం మార్గంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. మూడేళ్ల బాలుడిని బలి తీసుకుంది. అనంతపురం జిల్లా తనకల్లు మండలం సుబ్బరాయుడు పల్లెకు చెందిన అశ్విని... తన మూడేళ్ల కుమారుడితో తంబళ్లపల్లి మండలంలోని పుట్టింటికి వెళ్తుండగా ప్రమాదానికి జరిగింది. మలుపు వద్ద ఎదురుగా వచ్చిన వాహనాన్ని తప్పించబోయి ఆటో బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో బాలుడు ఆటో కింద పడిపోగా.. తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు దృవీకరించారు. ఆటో డ్రైవర్ మలుపు వద్ద అతివేగంగా నడపటం వల్లే.. ఎదురుగా వచ్చిన వాహనం తప్పించే ప్రయత్నంలో ప్రమాదం జరిగినట్లు స్థానికులు పేర్కొన్నారు. ఘటనపై తంబళ్లపల్లె పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: