ETV Bharat / state

ఎర్రచందనం స్మగ్లింగ్.. ముగ్గురు అరెస్ట్ - three smagglers arrest in chittoor district

శేషాచలం అటవీ ప్రాంతంలో తమిళ స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. పగలు చెట్లను నరకడం రాత్రి పూట దుంగలను తరలించడం వంటి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో పాత నేరస్థులు ముగ్గురుని టాస్క్ ఫోర్స్ అధికారులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 20 దుంగలు స్వాధీనం చేసుకున్నారు.

ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నముగ్గురి అరెస్ట్

author img

By

Published : Sep 10, 2020, 5:11 PM IST

చిత్తూరు జిల్లా, చంద్రగిరి మండలం శ్రీవారిమెట్టు సమీపంలోని పావురాల గుట్ట వద్ద కూంబింగ్ నిర్వహిస్తున్న టాస్క్ ఫోర్స్ అధికొరులకు సుమారు 20 మంది తమిళ స్మగ్లర్లు తారసపడ్డారు. రాళ్ళతో దాడికి పాల్పడ్డారు. దట్టమైన అడవిలోకి పారిపోతున్న వారిని టాస్క్ ఫోర్స్ సిబ్బంది వెంటాడి ముగ్గురుని అరెస్ట్ చేశారు.

వారి నుంచి రూ. 30 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిని పాత కేసుల్లో ముద్దాయిలుగా గుర్తించారు. తమిళనాడుకు చెందిన కుమార్ అనే వ్యక్తి ద్వారా ఎర్రచందనం కూలీలు అడవుల్లోకి వచ్చినట్లు విచారణలో తెలిసిందని డీఎస్పీ చెప్పారు. పరారైన వారి కోసం గాలిస్తున్నామన్నారు.

ఇదీ చదవండి:

అంతర్వేది ఘటన తర్వాత అప్రమత్తమైన తితిదే అధికారులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.