చిత్తూరు జిల్లా పెదపంజాణి మండలం తిప్పిరెడ్డిపల్లిలో విషాదం జరిగింది. గ్రామానికి చెందిన రామకృష్ణ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. సాయంత్రం పొలం దగ్గర ఆవులు కట్టివేసి పాలు పితికేందుకు తన ఇద్దరు కూతుళ్లతో కలిసి వెళ్లాడు. ఒక్కసారిగా భారీ వర్షంతో పాటు పిడుగు పడటం వల్ల... పొలం వద్ద పాలు పితుకుతున్న రామకృష్ణతో పాటు అతని ఇద్దరు కుమార్తెలు రమాదేవి, మీనాలు మృతిచెందారు. విషయం తెలుసుకున్న స్థానికులు సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులకు సమాచారం అందజేశారు. రామకృష్ణ భార్య విషయం తెలుసుకున్న వెంటనే స్పృహ కోల్పోయింది. మృతుల కుటుంబసభ్యులు, గ్రామస్తుల ఆర్తనాదాలతో సంఘటన స్థలం దద్దరిల్లింది. గంగవరం సీఐ రామకృష్ణచారి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: 'తెదేపా కార్యకర్తలపై దాడులను సహించబోం'