చిత్తూరు జిల్లా కుప్పంలోని ఓ ఆలయంలో హుండీ చోరీకి దొంగలు విఫలయత్నం చేశారు. మోడల్ కాలనీలోని ఆలయంలో.. దొంగతానికి ప్రయత్నించారు. ముసుగులు ధరించి వచ్చిన నలుగురు వ్యక్తులు.. హుండీని పగులగొట్టేందుకు చూశారు. స్థానికులు గుర్తించి వెంబడించగా.. దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీలో రికార్డయ్యాయి. వీటి ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇవీ చూడండి: