ETV Bharat / state

Redsandal: పది ఎర్రచందనం దుంగలు స్వాధీనం.. పోలీసుల అదుపులో స్మగ్లర్​ - red sandalwood latest news

చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం ఆంజనేయపురం చెక్​పోస్ట్ పరిధిలో ప్రత్యేక కార్యదళం అధికారులు కూంబింగ్​ నిర్వహించారు. ఈ తనిఖీల్లో పది ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని, స్మగ్లర్​ను అదుపులోకి తీసుకున్నారు.

red sandalwood
పోలీసుల అదుపులో నిందితుడు
author img

By

Published : Jun 19, 2021, 5:35 PM IST

చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం ఆంజనేయపురం చెక్​పోస్ట్ పరిధిలో ప్రత్యేక కార్యదళం అధికారులు కూంబింగ్ నిర్వహించారు. చైతన్యపురం వద్ద స్మగ్లర్ల కదలికలను గమనించి తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో పది ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ మురళీధర్​ తెలిపారు. వాటిని తరలించేందుకు ప్రయత్నించిన స్మగ్లర్​ను అదుపులోకి తీసుకున్నామన్నారు. అతని వద్ద ఉన్న కారును సీజ్​ చేసినట్లు చెప్పారు.

ఎర్రచందనం దుంగల తరలింపుపై స్మగ్లర్​ను ప్రశ్నించగా.. దీనికి సూత్రధారి బెంగుళూరులో ఉన్నట్లు తెలిపాడని డీఎస్పీ చెప్పారు. అడవిలో దాచిన దుంగలను కారులో తరలిస్తుండగా ఆకస్మికంగా చేపట్టిన తనిఖీల్లో దొరికిపోయాడని అన్నారు. దీనిపై పూర్తి దర్యాప్తు చేపట్టి, తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

ఇదీ చదవండి: పోలీసుల అదుపులో.. ఎంకే కన్​స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ డైరెక్టర్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.