తిరుపతి నగరంలోని కొన్ని వార్డుల్లో రెండు రోజులపాటు నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని నగర వాసులు సహకరించాలని తిరుపతి నగరపాలక కమిషనర్ గిరీష కోరారు. 1 నుంచి 33, 42 నుంచి 50 వార్డులో నీటి సరఫరా అంతరాయం ఏర్పడుతుందని అధికారులు ప్రకటించారు. నీటిని పొదుపుగా వాడుకోవాలని అత్యవసరమైతే ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తామని నగరపాలక సంస్థ కమిషనర్ గిరీష తెలిపారు.
తెలుగు గంగ హెడ్ వాటర్ వర్క్‌లోని మంగళం పంప్ హౌస్ నుంచి మంగళం ఫిల్టర్ హౌస్‌కు పంపింగ్ చేసే ప్రధాన పైపు లైను పగిలిపోవటంతో మరమ్మతు పనులు సాగుతున్నట్లు అధికారులు తెలిపారు. నేటి నుంచి మరో రెండు రోజుల పాటు నీటి సరఫరాలో అంతరాయం ఉంటుందని చెప్పారు. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా నీటిని నిలువ చేసుకోవాలని సూచించారు. అత్యవసరమైన వార్డులలో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయనున్నట్లు ప్రకటించారు.
ఇదీ చదవండి: