లాక్డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమైన పేదలను ఆదుకునేందుకు చిత్తూరు జిల్లా వెదురుకుప్పం ఉపాధ్యాయులు ముందుకు వచ్చారు. ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ మండల శాఖ ఆధ్వర్యంలో 75 పేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులను అందించారు. నిత్యావసర వస్తువులను రెవెన్యూ అధికారులకు అందించి, వారి ద్వారా పేదలకు పంపిణీ చేయించారు. ప్రజలంతా ఇళ్లల్లోనే ఉంటూ, కరోనా వ్యాప్తి నివారించేందుకు ప్రభుత్వానికి సాయం చేయాలని ఈ సందర్భంగా ఉపాధ్యాయులు సూచించారు.
ఇదీ చదవండి: మదనపల్లెలో వలస కూలీలకు నిత్యావసరాల పంపిణీ