అమరావతి రైతులకు, మహిళలకు సుప్రీంకోర్టులో న్యాయం చేసేలా తీర్పు రావాలని కోరుతూ తిరుపతిలో తెదేపా నేతలు వినూత్న ప్రదర్శన నిర్వహించారు. అలిపిరిలోని గరుడ సర్కిల్ వద్ద మోకాళ్లపై మోకరిల్లి రైతులకు న్యాయం జరిగేలా చూడాలని శ్రీవారికి మొక్కుకున్నారు.
రాష్ట్రం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో తమ భూములను రైతులు ప్రభుత్వానికి అప్పగించారని, అలాంటి వారిని కాపాడుకోవటం ధర్మమని తెదేపా నేతలు అన్నారు. సుప్రీంకోర్టులో వాళ్లకి న్యాయం జరుగుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: