'శాసనమండలి రద్దు సీఎం జగన్ అవివేకానికి నిదర్శనం' - నగరి తెదేపా నియోజకవర్గ బాధ్యుడు గాలి భాను ప్రకాశ్
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పునరుద్ధరించిన శాసనమండలిని... ఆయన తనయుడు జగన్ రద్దు చేయడం దుర్మార్గమైన చర్యని నగరి తెదేపా నియోజకవర్గ బాధ్యుడు గాలి భానుప్రకాశ్ పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా పుత్తూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే పలు రాష్ట్రాలు శాసనమండలి కావాలని అడుగుతున్నాయని... ఈ నేపథ్యంలో ఏపీ శాసనమండలి రద్దు చేయడం ముఖ్యమంత్రి జగన్ అవివేకానికి నిదర్శనమన్నారు.
Intro:చిత్తూరు జిల్లా పుత్తూరులో నగరి తేదేపా నియోజకవర్గ బాధ్యుడు గాలి భానుప్రకాష్ విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జరుగును శాసన మండలి రద్దు చేశారని ఇది తగదని పేర్కొన్నారు . దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి శాసన మండల ప్రవేశపెట్టారని ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అభ్యంతరం తెలియజేశారు అయితే నేడు ఆయన తనయుడు శాసన మండలి రద్దు చేయడం దుర్మార్గమన్నారు ఒకరేమో మండలం పునరుద్ధరిస్తూ ఒక రద్దు చేయడం ఎంత వరకు సమంజసమన్నారు ఇప్పటికే పలు రాష్ట్రాలు శాసనమండలిలో కావాలని అడుగుతున్నారని ఈ నేపథ్యంలో ఏపీ శాసన మండలి రద్దు చేయడం ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు ఏపీ రాష్ట్ర రాజధాని అమరావతి కాదని మూడు రాజధాని ప్రతిపాదన తీసుకు రావడం తగదు అని తెలిపారు రాష్ట్రంలో కావాలని సృష్టించారని తెలిపారు అధికారంలోకి వచ్చిన ఈ నెలలో కార్యాలయం ఒక్క రూపాయి అభివృద్ధి పనులు చేపట్టలేదు అన్నారు ఈ సమావేశంలో తెదేపా నాయకులు పాల్గొన్నారు