ETV Bharat / state

తంబళ్లపల్లెలో తుది జాబితాపై ఎస్​ఈసీకి చంద్రబాబు ఫిర్యాదు

author img

By

Published : Feb 9, 2021, 10:24 PM IST

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో 2వదశ గ్రామ పంచాయతీ ఎన్నికల తుది జాబితా.. విడుదల చేయకపోవటంపై.. తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ మద్దతుదారున్ని పోటీ నుంచి తొలగించటం కోసమే.. అభ్యర్థుల జాబితా ప్రకటించటం లేదని విమర్శించారు.

tdp leader  Chandrababu
తంబళ్లపల్లెలో తుది జాబితా విడుదల కాకపోవటంపై ఎస్​ఈసీకి ఫిర్యాదు చేసిన చంద్రబాబు

తంబళ్లపల్లె నియోజకవర్గంలో జరగనున్న 2వదశ గ్రామ పంచాయతీ ఎన్నికల.. తుది జాబితా విడుదల చేయకపోవటంపై తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. తమ పార్టీ సానుభూతిపరున్ని తప్పించటం కోసమే అభ్యర్థుల జాబితా ప్రకటించటం లేదని ఆయన విమర్శించారు. ఈ మేరకు ఎంపీడీవో దివాకర్ రెడ్డి, ఎస్ఐ సహదేవి, ఎమ్మెల్యే బంధువు భాను, అతని పిఏ హేమంత్ కుమార్​లపై ఎస్​ఈసీకి ఫిర్యాదు చేశారు. పోటీదారుల నామినేషన్ ఉపసంహరణ గడువు ముగిసినా ఇంతవరకు జాబితా ప్రకటించలేదని అన్నారు.

ప్రతిపక్ష పార్టీ బలపరిచిన అభ్యర్థులను పోటీ నుంచి తప్పించే ఉద్దేశంతో ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి.. జాబితా ప్రకటించకుండా అడ్డుకుంటున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఎలాంటి అవకతవకలు లేకుండా పోటీదారుల జాబితా వెంటనే ప్రకటించాలని ఆయన డిమాండ్‌ చేశారు. శాంతియుత ఎన్నికల నిర్వహణకు అదనపు పోలీసు బలగాలను కేటాయించాలని కోరారు. కోడ్ ఉల్లంఘనలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండీ... 'ఎన్నికల్లో ఓడిపోతారనే అప్రజాస్వామిక విధానాలకు పాల్పడుతున్నారు': చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.