ETV Bharat / state

చిత్తూరులో ఘనంగా తెదేపా ఆవిర్భావ వేడుకలు - గంగాధర నెల్లూరు తాజా వార్తలు

చిత్తూరు జిల్లాలో తెదేపా ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. 40వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించిన నాయకులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. 2024లో జరిగే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వచ్చేలా ప్రతీ కార్యకర్త పని చేయాలని నాయకులు దిశానిర్దేశం చేశారు.

తెదేపా ఆవిర్భావ వేడుకలు
తెదేపా ఆవిర్భావ వేడుకలు
author img

By

Published : Mar 29, 2021, 10:25 PM IST

చిత్తూరు జిల్లాలోని పలు మండలాల్లో తెదేపా ఆవిర్భవ దినోత్సవాన్ని నాయకులు ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయాల్లో జెండాను ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. తిరుపతిలో తెదేపా ఆవిర్భావ దినోత్సవంలో అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. వైకాపా ప్రభుత్వం ఇసుకపై రూ.5 వేల కోట్ల దోపిడీకి తెరలేపిందని ఆరోపించారు. తిరుపతి పవిత్రతను కాపాడాలంటే వైకాపాను ఓడించాలని అన్నారు. వాలంటీర్లతో భయపెట్టి ఓట్లు వేయించుకుంటున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. పథకాలు ఆపుతామని వాలంటీర్లు బెదిరిస్తే రికార్డు చేయాలని పిలుపునిచ్చారు. రికార్డు చేసి పంపిస్తే రూ.10 వేలు పారితోషికం ఇస్తామని అచ్చెన్నాయుడు ప్రకటించారు.

మదనపల్లిలో..

మదనపల్లిలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మదనపల్లి నియోజకవర్గం బాధ్యులు దొమ్మలపాటి రమేశ్, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పట్టణంలోని ఎన్టీఆర్ కూడలిలో పార్టీ జెండాను ఆవిష్కరించిన పార్టీ న్యాయకులు.. నందమూరి తారక రామారావు విగ్రహానికి పూజలు చేశారు. పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి తెదేపాను స్థాపించారన్నారు. 2024లో జరిగే ఎన్నికల్లో తెదేపాను విజయపథంలో నడిపించాలని కార్యకర్తలను రమేశ్ కోరారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటేనే ఈ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉంటారని అన్నారు.

గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో..

గంగాధర నెల్లూరు నియోజకవర్గ పరిధిలోని వెదురుకుప్పం, కార్వేటినగరం, శ్రీరంగరాజపురం మండలాలలో తెదేపా ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్వేటినగరం, శ్రీరంగరాజపురం మండలాల్లో నందమూరి తారకరామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ పతాకాన్ని ఎగురవేసి నేతలు నినాదాలు చేశారు. వెదురుకుప్పం మండల కేంద్రంలో పార్టీ జిల్లా కార్యదర్శి మోహన్ మురళి నేతృత్వంలో నాయకులు కేక్ కోసి సందడి చేశారు.

పుత్తూరులో..

పుత్తూరు కూడలిలో తెదేపా జెండాను నగరి నియోజకవర్గ ఇంఛార్జ్​ గాలి భానుప్రకాష్ ఎగరవేశారు. అనంతరం ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. నాలుగు దశాబ్దాలుగా చెక్కుచెదరని ప్రజా అభిమానంతో కొనసాగుతున్న తెలుగుదేశం పార్టీకి బలం కార్యకర్తలు, నాయకులేనని నేతలు అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల నుంచి ఎంతోమందిని యువతరాన్ని తెదేపా రాజకీయాలకు పరిచయం చేసిందని తెలిపారు.

రాయదుర్గంలో..

రాయదుర్గంలో ఘనంగా తెదేపా ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో నందమూరి తారక రామారావు విగ్రహానికి, చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్థానిక కార్యాలయం ముందు పార్టీ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో రాయదుర్గం తేదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

తిరుపతిలో రాజుకున్న పార్లమెంట్‌ ఉపఎన్నికల వేడి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.