చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో యథేచ్ఛగా ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరుగుతోందని తెదేపా వర్గాలు అంటున్నాయి. యర్రావారిపాళ్యం మండలంలోని ఉస్తికాయల పెంట గ్రామ సచివాలయంలో రాత్రి 9:30గంటల సమయంలో పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని తెదేపా శ్రేణులు అడ్డుకున్నాయి.
ధ్రువపత్రాల అవసరానికి కార్యాలయానికి వస్తే తప్పించుకునే అధికారులు రాత్రిపూట దొంగతనంగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేయటాన్ని తెదేపా నేతలు తప్పుపట్టారు. వీఆర్వోలు, వాలంటీర్స్ గుట్టుచప్పుడు కాకుండా పట్టాలను ఇంటింటికి చేరవేయడానికి సిద్ధం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా పట్టాల పంపిణీ చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. పట్టాల పంపిణీపై ఎస్ఈసీ దృష్టి సారించాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: "బలవంతపు ఏకగ్రీవాలను ఉపేక్షించం"