తెదేపా కేంద్ర కార్యాలయంపై వైకాపా దాడులు అమానుషమని ఆ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలం పచ్చికాపల్లం కూడలిలో తెదేపా నాయకులు పెద్ద ఎత్తున మోహరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించాయని అన్నారు. ముందస్తుగా పలువురు నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. పోలీసు స్టేషన్ ఎదుట నిరసనకు దిగారు.
శ్రీకాళహస్తిలో..
తెదేపా కార్యాలయాలు, నేతలపై దాడులకు నిరసనగా చేపట్టిన బంద్‌లో భాగంగా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో తెదేపా నేతలను అడ్డుకునేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. తెదేపా రాష్ట్ర కార్యదర్శి గురువారెడ్డిని ముందస్తుగా ఏర్పేడు పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం తేదేపా ఇంచార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన స్వగ్రామమైన ఊరందూరులోని నివాసం ఎదుట పెద్దఎత్తున పోలీసులు మోహరించి ఇంటి నుంచి బయటకు రాకుండా సుధీర్‌రెడ్డిని అడ్డుకున్నారు.
చంద్రగిరిలో...
చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల్లో తెదేపా ముఖ్య నాయకులను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ప్రధాన కూడళ్ళలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. చంద్రగిరి మండలంలోని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వగృహం వద్ద నారావారిపల్లి గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
చిత్తూరులో...
చిత్తూరులోని బీవీ రెడ్డి కాలనీలో తేదేపా ఎమ్మెల్సీ దొరబాబును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. తెదేపా నగర అధ్యక్షులు కటారి హేమలత, రాష్ట్ర కార్యదర్శి సురేంద్ర కుమార్ను గృహ నిర్బంధం చేశారు. పూతలపట్టు మండలంలో తెదేపా నేత దొరబాబు ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
Ministers Fires On TDP: పట్టాభి వ్యాఖ్యలపై మంత్రులు ఫైర్.. సహించేది లేదని తీవ్ర వ్యాఖ్యలు