చిత్తూరు జిల్లా శేషాచలం అటవీ ప్రాంతంలోకి చొరబడేందుకు యత్నించిన తమిళనాడు కూలీలను ఎర్రచందనం ప్రత్యేక కార్యదళం అధికారులు అడ్డుకున్నారు. చంద్రగిరి మండలం ఐతేపల్లి వద్ద ప్రత్యేక కార్యదళం కూంబింగ్ నిర్వహించగా..అనుమానాస్పదంగా కనిపించిన కొంతమందిని అధికారులు ప్రశ్నించారు.
పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అధికారులు 14మందిని అదుపులోకి తీసుకున్నారు. కూలీలంతా తమిళనాడులోని తిరువణ్ణామలైకి చెందిన వారిగా గుర్తించామని అధికారులు తెలిపారు. నిత్యావసరాల సరుకులు, మద్యం, సామగ్రిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు టాస్క్ఫోర్స్ డీఎస్పీ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: పురపోరులో వైకాపా జోరు.. 11 కార్పొరేషన్లు కైవసం