తిరుపతి వేదికగా జరుగుతున్న స్టేట్ పోలీస్ డ్యూటీ మీట్ లో రెండో రోజు స్పెషల్ వెపన్స్ అండ్ టాక్టిక్స్( స్వాట్) కమాండోల ప్రదర్శన ఆకట్టుకుంది. జోరు వానను సైతం లెక్కచేయకుండా ప్రకాశం జిల్లాకు చెందిన స్వాట్ బృందం తమ విన్యాసాలతో అలరించింది. శత్రువు అనుకోకుండా దాడి చేసినప్పుడు... ప్రత్యేకంగా తర్ఫీదు పొందిన ఈ బృందం అవలంబించే విధానాలను కమాండోలు కళ్లకు కట్టారు. వానను సైతం లెక్కచేయకుండా... కమాండోలు చేసిన అద్భుత ప్రదర్శనను డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రత్యేకంగా అభినందించారు.
ఇదీ చదవండి: 7 దశాబ్దాల క్రితం.. పోలీసుల పని తీరు ఎలా ఉండేదో తెలుసా?