చిత్తూరు జిల్లా పుత్తూరులో రూ. 55 కోట్ల వ్యయంతో నిర్మించిన సమ్మర్ స్టోరేజ్ ఆనకట్ట బీటలు వారింది. సుమారు 100 మీటర్ల వరకు పగుళ్లు ఏర్పడ్డాయి. అధికారుల ద్వారా సమాచారాన్ని తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే రోజా.. నీటిపారుదల శాఖ అధికారులను అప్రమత్తం చేశారు.
విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం నారాయణ స్వామి.. అధికారులతో సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆనకట్ట నిర్మాణ పనులపై ఆరా తీశారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఆనకట్టకు బీటలు వారాయన్నారు. అందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మరమ్మతులు చేపట్టాలని సూచించారు.
ఇవీ చదవండి:
గోవిందరాజస్వామివారి ఆలయంలో వైభవంగా ధ్వజారోహణ.. ఏకాంతంగా నిర్వహణ