సంసారం చదరంగం లాంటిది. ఎన్నో సమస్యలు తలెత్తుతుంటాయి. పంతాలకు, పట్టింపులకు పోయి విలువైన ప్రాణాలను తీసుకోవడం వల్ల పిల్లలను అనాథులుగా మారుతున్నారు. భార్యాభర్తల విషయానికి వస్తే పంతాలు.. పట్టింపులు.. భేషజాలకు పోవటం.. తమదే పైచేయిగా ఉండాలనే మొండిపట్టుదలతో ఆత్మహత్యలకు వరకు పరిణామాలు దారితీస్తున్నాయి.
*క్షణికావేశంతో ఇద్దరు చిన్నారులతో పాటు ఓ తల్లి బలవన్మరణంతో తనువు చాలించిన సంఘటన ఇటీవలే చిత్తూరు జిల్లాలోని శ్రీరంగరాజపురంలోని చిన్నతయ్యూరు ఎస్సీ కాలనీలో చోటుచేసుకుంది. వారు లేని నేనెందుకని వెంటనే భర్త కూడా ఆత్మహత్యకు పాల్పడటంతో కుటుంబమే బలైపోయింది.
*పుంగనూరులో ఇద్దరు బిడ్డలతో సహా తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. మార్చిలో జరిగిన ఘటనతో ఇద్దరు వృద్ధులు అనాధలయ్యారు.
*తాగుడుకు బానిసైన భర్తను భరించలేక పలమనేరులో భార్యతో పాటు ఆమె కూతురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కిట్టన్ మిషన్ వీధిలో జరిగిన ఘటనతో భర్త అనాథగా తిరుగుతున్నాడు.
*ప్రేమ విఫలం కావటంతో సదుం మండలంలో సర్వేయర్‌గా పని చేస్తున్న ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన తల్లిదండ్రులకు మతిస్థిమితం లేకుండా చేసింది.
* వీరే కాదు.. ఇలాంటి వారు ఎందరో క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడి.. కన్నపేగులను, కట్టుకున్నోళ్లను ఒంటరి చేస్తున్నారు. కనిపెంచిన వారికి కడుపు కోత మిగుల్చుతున్నారు. తల్లి ఆత్మహత్యతో తండ్రి జైలు పాలైతే.. పిల్లలు అనాథులుగా బతుకుతున్న ఘటనలూ ఉన్నాయి.
దిశ యాప్‌తో రక్షణ
మీ మొబైల్ నుంచి ఇంటర్నెట్ సాయంతో గూగుల్ ప్లే స్టోర్‌లో కెళ్లి దిశ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇంటర్నెట్ ఉన్నా.. లేకున్నా ఫోన్ ద్వారా ఈ యాప్‌ను వినియోగించవచ్చు. యాప్‌లోనే డయల్ 100, 122 నెంబర్లు పొందుపర్చారు. డయల్ 100 అయితే నేరుగా కాల్ చేసి విషయం చెప్పాలి. డయల్ 122 అయితే మిస్డ్ కాల్ ఇచ్చినా సరిపోతుంది. ఈ యాప్‌లో పోలీసు అధికారుల ఫోన్ నెంబర్లు, సమీపంలోని పోలీస్‌స్టేషన్ల వివరాలు తెలుసుకునేందుకు ఆప్షన్లు ఉంటాయి. తద్వారా మహిళలు సమస్యలు ధైౖర్యంగా పరిష్కరించుకోవచ్చు.
భావాలు పంచుకుంటే చాలు
భావాలు పంచుకుంటే బాధలు తప్పిపోతాయి. ఒంటరితనం లేకుండా ఇతరులతో సంబంధాలు కలిగి ఉండాలి. సమస్యలకు ఆత్మహత్యే పరిష్కారం కాదని అర్థం చేసుకోవాలంటున్నారు సైకాలజిస్ట్ డాక్టర్ ఎన్.బి.సుధాకరరెడ్డి. మానసిక ఒత్తిడి దీర్ఘకాలికంగా కొనసాగకుండా జాగ్రత్తలు పాటించాలి. ప్రభుత్వం కూడా కౌన్సెలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి సమస్యల నుంచి బయటపడటానికి సలహాలు, సూచనలు చేయాలని తెలిపారు.
టెలీ కౌన్సెలింగ్ ఇస్తున్నాం
కొవిడ్ కాలంలో ఉమ్మడి కుటుంబాలతో సమస్యలు పరిష్కారం కావాలి. అయితే సమస్యలు మరింత ఉత్పన్నం అవుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయని డీఎస్పీ బాబుప్రసదా్ తెలిపారు. ఈ తరుణంలో పోలీసుశాఖ తమవంతు బాధ్యతగా చర్యలు చేపట్టిన్నారు. కరోనాతో బయటికి వెళ్లలేని పరిస్థితిలో టెలీ కౌన్సెలింగ్ వ్యవస్థను ప్రజలకు 24 గంటలు అందుబాటులోకి తెచ్చాం. బాధితులు 100, దిశ యాప్ ద్వారా సమస్యలు పరిష్కరించుకోవచ్చు. ఆత్మహత్య జీవితానికి పరిష్కారం కాదని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి.
ఇదీ చూడండి