చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాసమంగాపురంలో శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల ముందు ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేయడం ఆనవాయితీ. ఈ నెల 14 నుంచి 22 వరకు ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం చేశారు. ఉదయం 6 గంటల నుంచి 10.30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరిగింది. ఈ సందర్బంగా ఆలయ ప్రాంగణాన్ని శుద్ధి చేశారు. అనంతరం పవిత్ర మిశ్రమాలతో ఆలయ సంప్రోక్షణం చేశారు. కార్యక్రమం అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు. తిరుపతికి చెందిన నరసింహులు అనే భక్తుడు రెండు పరదాలు, ఒక కురాళాన్ని విరాళంగా అందించారు.
ఇదీ చూడండి: