ETV Bharat / state

సెప్టెంబరు 30 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు - సెప్టెంబరు 30 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు

తిరుమల శ్రీవారి సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 30న ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు స్వామి వారి వాహన సేవల వివరాలను తితిదే వెల్లడించింది.

తిరుమల
author img

By

Published : Jul 28, 2019, 6:17 AM IST

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను సెప్టెంబరు 30 నుంచి అక్టోబరు 8 వరకు నిర్వహించనున్నట్లు తితిదే తెలిపింది. స్వామివారి వాహన సేవల వివరాలు, తేదీలను శనివారం వెల్లడించింది. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు, రాత్రి 8 నుంచి 10 గంటల వరకు స్వామివారి వాహనసేవలు జరుగుతాయని వివరించింది. గరుడ వాహన సేవను రాత్రి 7 గంటలకే ప్రారంభించనున్నట్లు పేర్కొంది. సెప్టెంబరు 5న స్వామివారికి స్వర్ణ రథోత్సవం ప్రత్యేకంగా జరుగుతుందని తెలిపింది. ఉత్సవాల నేపథ్యంలో ఆలయ శుద్ధిలో భాగంగా సెప్టెంబరు 24న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహిస్తామని, 29న ఉత్సవాలకు అంకురార్పణ జరుగుతుందని వివరించింది. 30న సాయంత్రం ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని, ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించే కార్యక్రమం జరుగుతుందని పేర్కొంది.

వాహన సేవల వివరాలు

తేదీ ఉదయం రాత్రి
30.9.2019 ----- పెద్దశేష వాహనం
01.10.2019 చిన్నశేష వాహనం హంస వాహనం
02.10.2019 సింహ వాహనం ముత్యపు పందిరి వాహనం
03.10.2019 కల్పవృక్ష వాహనం సర్వ భూపాల వాహనం
04.10.2019 మోహినీ అవతారం గరుడ వాహనం
05.10.2019 హనుమంత వాహనం గజ వాహనం
06.10.2019 సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
07.10.2019 రథోత్సవం అశ్వ వాహనం
08.10.2019 చక్ర స్నానం ధ్వజావరోహణం

Intro:AP_TPT_31_27_thepposthavam_AV_AP10013 ఆడికృత్తిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీకాళహస్తి లో ఘనంగా శ్రీ సుబ్రహ్మణ్యం స్వామి తెప్పోత్సవం.

Body:ఆడికృత్తిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి లో విజ్ఞాన గిరి పై వెలసిన శ్రీ సుబ్రహ్మణ్యం స్వామి ఆలయంలో భక్తులు రద్దీ పోటెత్తింది. శ్రీ వళ్లి, దేవసేన సమేతుడై న సుబ్రహ్మణ్యం స్వామి ఉత్సవర్లు గా కొలువుదీరి శ్రీ నారద పుష్కరిణిలో తెప్పలు పై అది రోహించారు. వేద పండితులు మంత్రోచ్ఛారణల మధ్య స్వామి,అమ్మవార్లు తెప్పలపై తిరిగారు. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చి కుమార స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. పుష్కరిణి హరోహర నామస్మరణ లతో మార్మోగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు.

Conclusion:చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి లో ఘనంగా కార్తికేయ తెప్పోత్సవం .సి. వెంకటరత్నం, ఈటీవీ భారత్ ,శ్రీకాళహస్తి, 8008574559.

For All Latest Updates

TAGGED:

tirumla
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.