సినీ నటుడు సోనూసూద్(sonu sood) మరోసారి తన దాతృత్వాన్ని చాటారు. కరోనా రోగికి సాయపడాలంటూ సందేశం పంపిన 8 గంటల్లోనే.. సహాయం అందేలా చేసి తన ప్రత్యేకతను చాటుకున్నారు.
చిత్తూరు జిల్లా గుడుపల్లె మండలం చిన్నపర్తికుంటలో.. ధనుంజయులు అనే వ్యక్తికి కరోనా సోకి కాన్సన్ట్రేటర్ అవసరం పడింది. దీంతో కుప్పంకు చెందిన యువ కళాకారుడు పురుషోత్తం.. ధనంజయలు పరిస్థితిని సోనుసూద్ దృష్టికి తీసుకెళ్లారు. గతంలో సోనూసూద్ చిత్రాలు గీసి, ఆయన నుంచి నేరుగా ప్రశంసలు అందుకున్న పురుషోత్తం.. సహాయం అడిగిన వెంటనే స్పందించారు. సాయంత్రానికల్లా గ్రామానికి ఆక్సిజన్ కాన్సెంట్రేటర్ను సోను సూద్ బృందం చేరవేసింది. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ సమయానికి గ్రామానికి చేరుకున్నా.. అప్పటికే ధనుంజయులు తీవ్ర అస్వస్థతకు గురవడంతో.. స్థానికుల ఓ ప్రైవేట్ ఆసుపత్రికి మెరుగైన చికిత్స కోసం తరలించారు. అడిగిన వెంటనే స్పందించి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పంపిన సోనూసూద్ ఉదారతను గ్రామస్థులు కొనియాడుతున్నారు.
ఇదీ చదవండి: అమెరికా తెలుగు అసోసియేషన్ దాతృత్వం: 50 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు అందజేత