చిత్తూరు జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ ఆదేశాల మేరకు పీలేరు రూరల్ సీఐ మురళీ కృష్ణ, ఎస్సై సోమశేఖర్లు యర్రావారి పాలెం మండలం, బోడెవాండ్ల పంచాయతీ, సాకేడి గుట్ట వద్ద తనిఖీలు నిర్వహించారు. ఎర్రచందనం దుంగలు తరలిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి సుమారు 5 లక్షలు విలువ చేసే 8 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నట్లు పీలేరు రూరల్ సీఐ మురళి కృష్ణ తెలిపారు.
ఇదీ చదవండి : శేషాచలం అటవీ సమీప ప్రాంతాల్లో పోలీసుల తనిఖీలు..