ETV Bharat / state

టాస్క్​ఫోర్స్​ సిబ్బందిపై స్మగ్లర్ల రాళ్ల దాడి - smugglers attack on taskforce police in seshachalam forest

చిత్తూరు జిల్లా పడమటి మండలాల్లోని శేషాచలం అడవుల్లో... ఎర్రచందనం స్మగ్లర్లు టాస్క్​ఫోర్స్​ సిబ్బందిపై రాళ్లదాడి చేశారు.

టాస్క్​ఫోర్స్​ సిబ్బంది రాళ్లు రువ్విన స్మగ్లర్లు
టాస్క్​ఫోర్స్​ సిబ్బంది రాళ్లు రువ్విన స్మగ్లర్లు
author img

By

Published : Dec 24, 2019, 7:50 PM IST

టాస్క్​ఫోర్స్​ సిబ్బందిపై స్మగ్లర్ల రాళ్ల దాడి

తిరుపతి పరిసర ప్రాంతాల్లో టాస్క్​ఫోర్స్ నిఘా పెరిగింది. దీంతో ఎర్రచందనం స్మగ్లర్లు రూటు మార్చారు. స్మగ్లర్లు జాడలపై టాస్క్​ఫోర్స్ సిబ్బంది పడమటి మండలాలపై దృష్టిసారించారు. మంగళవారం ఉదయం 2 గంటల సమయంలో రెడ్డివారిపల్లె వద్ద అనుమానాస్పదంగా ఓ వాహనం కనిపించింది. టాస్క్​ఫోర్స్​ సిబ్బంది వెంబడించి... ఆ కారును చుట్టుముట్టారు.

ఆ సమయంలో నలుగురు స్మగ్లర్లు సిబ్బందిపై రాళ్లు, కర్రలతో దాడి చేశారు. ఘటనలో ముగ్గురు సిబ్బందికి గాయాలయ్యాయి. అప్రమత్తమైన టాస్క్​ఫోర్స్ సిబ్బంది​ వారిని అదుపులోకి తీసుకున్నారు. స్మగ్లర్లు తమిళనాడు రాష్ట్రానికి చెందినవారుగా గుర్తించారు. 30 దుంగలు, కారును స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్​ఫోర్స్ పోలీసులు తెలిపారు. గాయపడిన సిబ్బందిని ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి :

శేషాచలం అడవుల్లో ఎర్రచందనం అక్రమ రవాణా.. తమిళ స్మగ్లర్​ అరెస్టు

Intro: చిత్తూరు జిల్లా పడమటి మండలాలలోని శేషాచల అడవులలో ఎర్రచందనం స్మగ్లర్లు.Body:Ap_tpt_38_24_smaglars_raalladaadi_av_ap10100

తిరుపతి పరిసర ప్రాంతాలలో టాస్క్ ఫోర్స్ నిఘా ఎక్కువ కావడంతో ఎర్రచందనం స్మగ్లర్లు రూటు మార్చారు. స్మగ్లర్లు జాడలపై టాస్క్ ఫోర్స్ సిబ్బంది పడమటి మండలాలపై దృష్టి సారించారు. అనుకున్నట్లు గానే పీలేరు సమీపంలో కె.వి పల్లి మండలం మారెళ్ల వద్ద స్మగ్లింగ్ జాడలను కనుగొన్నారు. మంగళవారం ఉదయం రెండు గంటల సమయంలో రెడ్డి వారి పల్లె వద్ద ఒక ఫొర్డ్ ఐకాన్ కారు అనుమానాస్పదంగా కనిపించింది. కారును చుట్టు ముట్టడంతో అక్కడే ఉన్న నలుగురు స్మగ్లర్లు టాస్క్ ఫోర్స్ సిబ్బందిపై రాళ్లు, కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు సిబ్బందికి గాయాలయ్యాయి. అప్రమత్తమైన టాస్క్ఫోర్స్ సిబ్బంది వారిని అదుపులోకి తీసుకున్నారు. స్మగ్లర్లు తమిళనాడు రాష్ట్రం, వేలూరు జిల్లా ......కోత్తలంపట్టు లోని జవ్వాదిమలై ప్రాంతానికి చెందినవారుగా గుర్తించారు. కారులో కొన్ని దుంగలు కనిపించగా, విచారణ లో..... పొలాల మధ్య దాచిన మరి కొన్ని దుంగల గురించి సమాచారం ఇచ్చారు. మొత్తం 30 దుంగలను, కారును టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గాయపడిన సిబ్బందిని చికిత్స నిమిత్తం ఆసుపత్రి కి తరలించారు. తొడపై బలంగా గాయపడిన కానిస్టేబుల్ శీనుని ఆసుపత్రి లో అడ్మిట్ చేశారు. టాస్క్ ఫోర్స్ పోలీసు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.Conclusion:పి.రవికిషోర్,చంద్రగిరి.9985555813.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.