చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మూడో రోజు ఉత్సవాల్లో భాగంగా సూర్య ప్రభ వాహనంపై స్వామివారిని ఊరేగించారు. చప్పరంపై సోమస్కంధ మూర్తి సమేత శ్రీ జ్ఞాన ప్రసూనాంబ దేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలోని అలంకార మండపం నుంచి బయలుదేరిన పంచ మూర్తులు.. మాడ వీధుల్లో ఊరేగారు. ఉత్సవాల ముందు నందీశ్వరుడు, ధ్వజపటాలం, భక్తుల కోలాటాలు అలరించాయి. కర్పూర నీరాజనాలతో స్వామి, అమ్మవార్లను భక్తులు దర్శించుకున్నారు.
ఇవీ చూడండి.. 'సంతకాన్ని ఫోర్జరీ చేయటమే కాకుండా.. ఎదురు నోటీసులు ఇస్తున్నారు'