ETV Bharat / state

ఇదేం పెద్దరికం పెద్దిరెడ్డి.. నువ్వే పాడి రైతులను దోచుకుంటే ఎలా..? - పెద్దిరెడ్డికి చెందిన శివశక్తి డెయిరీ

Shiva Shakthi Dairy: పుంగనూరు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పాడి రైతులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. రాష్ట్రంలోని సీనియర్‌ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దీనికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.పెద్దిరెడ్డికి చెందిన శివశక్తి డెయిరీ పాల ధరలను మరీ తగ్గించి రైతులను దోచుకుంటోంది. ఇతర డెయిరీలనూ గ్రామాల్లోకి అడుగు పెట్టనీయడం లేదు. దీంతో ధర లేక పాడి రైతులు దిగాలు పడుతున్నారు.

dairy farmers
పాడి రైతుల కష్టాలు
author img

By

Published : Jan 3, 2023, 7:20 AM IST

Updated : Jan 3, 2023, 10:26 AM IST

పాడి రైతులను దోచుకుంటున్న శివశక్తి డెయిరీ

Shiva Shakthi Dairy: రాష్ట్రంలోని సీనియర్‌ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పాడి రైతులు.. నిలువు దోపిడీకి గురవుతున్నారు. పెద్దిరెడ్డికి చెందిన శివశక్తి డెయిరీ.. పాల ధరలను మరీ తగ్గించి రైతులను దోచుకుంటోంది. అధికారంలోకి వచ్చినప్పటినుంచి కొన్నిగ్రామాల్లో ఇతర డెయిరీలనూ అడుగు పెట్టనీయడం లేదు. రాష్ట్రంలోని ఇతర డెయిరీలు పాడి రైతులను దోచుకుంటున్నాయంటున్న సీఎం.. ఇక్కడ తన మంత్రివర్గ సహచరుడి కనుసన్నల్లో నడిచే డెయిరీనే దోచుకుంటున్నప్పటికీ పట్టించుకోకపోవడం విమర్శల పాలవుతోంది.

ధర లేక దిగాలు: కవ్వం ఆడిన ఇంట కరవు ఉండదంటారు. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. పాడిరైతుల కష్టానికి ఫలితం ఉండటం లేదు. డెయిరీల తీరుతో ధర లేక దిగాలు పడుతున్నారు. తమగోడు ఎవరికైనా చెబితే ఏం జరుగుతుందనే భయంతో మిన్నకుండిపోతున్నారు. చివరకు పాల ధర గిట్టుబాటు కాక ఆవులను అమ్ముకుంటున్నారు

ఇతర డెయిరీలను అడుగుపెట్టనివ్వడం లేదు: మంత్రి పెద్దిరెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న పుంగనూరు నియోజకవర్గంలో ఆయన కుటుంబానికి చెందిన శివశక్తి డెయిరీ తప్ప అమూల్‌ సంస్థకు కూడా ప్రవేశం లేదు. సదుం, సోమల మండలాల్లో పాడి రైతులను శివశక్తి డెయిరీ నిలువునా దోచేస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రెండు మండలాల్లో ఏ ఒక్క ప్రైవేటు డెయిరీని అడుగు పెట్టనివ్వలేదు. బయటి ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ లీటరు పాలపై 10 నుంచి 15 రూపాయలు తగ్గించి రైతుల కడుపు కొట్టారు.

ప్రమాణాలకు తిలోదకాలు: రాష్ట్రంలో మొదటగా చిత్తూరు జిల్లాలోనే అమూల్‌ డెయిరీ ద్వారా పాల సేకరణ చేపట్టారు. రెండు దశల్లో మదనపల్లె, రామసముద్రం, కురబలకోట, నిమ్మనపల్లె, వాల్మీకిపురం మండలాల్లో.... 170 కేంద్రాలను ఏర్పాటు చేసి నిత్యం 26 వేల లీటర్లు పాలు సేకరిస్తున్నారు. మూడో దశలో కుప్పం, రామకుప్పంలో పాల సేకరణ చేపట్టారు. మదనపల్లె పక్కనే ఉన్న పుంగనూరు నియోజకవర్గంలోకి మాత్రం అమూల్‌ ప్రవేశించలేదు. చిత్తూరు జిల్లా కేంద్రంగా మహిళలతో ప్రారంభమై ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడులో పాలు సేకరిస్తున్న శ్రీజ పాలడైరీ సైతం పుంగనూరులో ప్రవేశించలేదు. జిల్లాలో ఇతర డెయిరీలు పాలసేకరణకు సాంకేతికత వినియోగిస్తున్నాయి. వెన్నశాతం ఆధారంగా లీటరు పాలకు ధరను నిర్ణయించి రశీదు ఇస్తున్నారు. పుంగనూరు నియోజకవర్గ పరిధిలో పాలు సేకరిస్తున్న శివశక్తి డెయిరీ పాల కొలతలు మొదలు..వెన్నశాతం లెక్కింపు వరకు ఎలాంటి ప్రమాణాలు పాటించడం లేదు. ఫలితంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

గిట్టుబాటు ధర రాక ఆవులు అమ్ముకుంటున్నారు: సదుం, సోమల మండలాల్లోని పాడి రైతుల పరిస్థితి భిన్నంగా ఉంది. గిట్టుబాటు ధర రాక ఆవులు అమ్ముకున్న దుస్థితి నెలకొంది. కిరణ్ కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు స్థానిక రైతుల వినతి మేరకు మండల కేంద్రం సోమలలో మిల్క్‌ బల్క్‌ కూలింగ్‌ యూనిట్ (బీఎంసీయూ) నెలకొల్పారు. సోమల మేజర్ పంచాయతీతో పాటు చుట్టుపక్కల ఉన్న పంచాయతీల నుంచి రోజుకు 4వేల లీటర్ల పాలు సోమల బీఎంసీయూలో చిల్లింగ్ చేసి మదనపల్లెకు పంపేవారు. గత ప్రభుత్వ హయాంలోనూ ఇదేవిధంగా బీఎంసీయూ కొనసాగింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన కొద్ది కాలానికే బీఎంసీయూ మూతపడింది. పాలు తక్కువగా వస్తున్నాయని, నాణ్యత లేదంటూ కార్యకలాపాలు నిలిపేశారు. శివశక్తి డెయిరీకి లబ్ధి చేకూర్చడానికే దీన్ని మూసేశారని ప్రతిపక్ష పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.

"ఒక లీటర్​కు 30 రూపాయలు మాత్రమే వస్తుంది. ఇతర డెయిరీలు కూడా రావడం లేదు. మూడు సంవత్సరాలు క్రితం రెండు..మూడు డెయిరీలు వచ్చేవి. ప్రస్తుతం ఒకటి మాత్రమే వస్తోంది. గిట్టుబాటు ధర లేక.. కూలికి పోవడం మేలని.. ఆవులను అమ్ముకున్నాం". - పాడి రైతులు

ఇవీ చదవండి:

Last Updated : Jan 3, 2023, 10:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.