ETV Bharat / state

వైకుంఠనాథుడి సన్నిథిలో మరిన్ని 'నిఘా నేత్రాలు'

ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భద్రతను పెంచడానికి తితిదే, పోలీసుశాఖ ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తోంది. స్వామివారిని దర్శించుకొనే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటం....తిరుమలకు వచ్చే వారి భద్రత భక్తుల మనోభావాలతో ముడిపడిన అంశం కావడంతో పటిష్ట చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే తిరుమలలో ఉన్న సీసీ కెమెరాల స్థానంలో మరింత ఆధునికమైనవి ఏర్పాటు చేయడంతో పాటు...పర్యవేక్షణకు సిబ్బందిని నియమిస్తున్నారు.

cctvs installed various places
author img

By

Published : Sep 18, 2019, 10:12 AM IST

కలియుగ వైకుంఠనాథుడు శ్రీవారిని దర్శించుకొనేందుకు వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. దేశంలో మరే పుణ్యక్షేత్రంలో లేని విధంగా ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే భక్తులు స్వామివారి సేవలో పాల్గొంటారు. నెలల నిండిన చిన్నారి నుంచి పండుముసలి వరకు శ్రీవారి దర్శనం కోసం వస్తుంటారు. ఈ నేపథ్యంలో భక్తుల భద్రతకు తితిదేతో పాటు పోలీసు శాఖ అధిక ప్రాధాన్యం ఇస్తోంది.

వైకుంఠనాధుడి సన్నిధిలో మరిన్ని 'నిఘా నేత్రాలు'

తిరుమలలో భద్రతపై దృష్టిసారించిన అధికారులు...భక్తులు రద్దీ అధికంగా ఉండే ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. స్వామివారి దర్శనానికి వచ్చిన వారిలో చిన్నారులను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లటం వంటి కేసులు ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో తొలి విడతో భాగంగా ఆలయం, మాడవీధులతో పాటు తిరుమలలో అత్యంత రద్దీ ప్రాంతాల్లో అత్యంత ఆధునికమైన 600 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. రెండో ఫేజ్‌లో మరో 1050 కెమెరాలు అమర్చుతున్నారు. దీంతో తిరుమల అత్యంత ఆధునిక సీసీ కెమెరాల నిఘా పరిధిలోకి రానుంది. ముఖాలను గుర్తించే సాంకేతికత, ఫింగర్‌ ప్రింట్‌ టెక్నాలజీ, కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ 1, 2, ఆర్టీసీ బస్టాండు, శ్రీవారి సేవాసదన్‌, క్యూలైన్లు, యాత్రికుల ఉచిత సముదాయాలు, ప్రముఖలు బస చేసే పద్మావతి నగర్‌, అన్నదాన సముదాయం, జనాలు అధికంగా ఉండే ఇతర కూడళ్లలో రెండో విడతలో 1050 కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. పదిహేనున్నర కోట్ల రూపాయలతో భద్రతను పటిష్టం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

తిరుమల పరిధిలో భద్రతను పటిష్టం చేస్తున్న అధికారులు.. రానున్న రోజుల్లో అలిపిరి నుంచి తిరుమల వరకు భద్రతను పటిష్టం చేయనున్నారు.

ఇదీ చదవండి: తిరుమల బ్రహ్మోత్సవాలకు.. విస్తృత ఏర్పాట్లు

Intro:ATP :- శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మరణం ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని చంద్రదండు, టిఎన్ఎస్ఎఫ్, తెలుగు యువత నాయకులు ఆరోపించారు. అనంతపురంలో ఎన్టీఆర్ సర్కిల్ వద్ద నాయకులు, కోడెల శివప్రసాద్ చిత్రపటానికి నివాళులర్పించి ర్యాలీ నిర్వహించారు.

Body:కోడెల శివప్రసాద్ మృతి కి కారణం ప్రభుత్వమేనని పార్టీ నాయకులు అక్రమ కేసులు, అరాచకాలు వల్ల ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని మండిపడ్డారు. దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చి తగిన మూల్యం చెల్లించాలని డిమాండ్ చేశారు.

బైట్..... ప్రకాష్ నాయుడు, చంద్రదండు రాష్ట్ర అధ్యక్షుడు, అనంతపురం జిల్లా.

Conclusion:అనంతపురం ఈటీవీ భారత్ రిపోర్టర్ రాజేష్ సెల్ నెంబర్ :- 7032975446.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.