తుపాను కారణంగా చిత్తూరు జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఎగువ నుంచి వచ్చే వరద ప్రవాహంతో చంద్రగిరి మండలంలోని కళ్యాణి డ్యామ్ నిండిపోయింది. జలాశయంలోని నీటి సామర్థ్యానికి ఇంకా రెండు అడుగులు మాత్రమే ఉండడంతో.. ఏ క్షణంలోనైనా గేట్లు ఎత్తడానికి అధికారులు అప్రమత్తంగా ఉంటున్నారు.
నిండుకుండను తలపిస్తున్న కళ్యాణి రిజర్వాయర్‌ను తిలకించేందుకు సందర్శకులు వస్తున్నారు. కానీ ఆనకట్ట పొడవునా లీకేజీల సమస్య ఉంది. పంప్ హౌస్‌కి అనుసంధానమైన విద్యుత్ తీగలు పర్యటకులు నడిచే దారిలో నిర్లక్ష్యంగా వదిలేశారు. ఆనకట్ట పైభాగం శిథిలావస్థకు చేరుకుని బేస్మట్టంలోని కమ్మీలు బయటకు కనిపిస్తున్నాయి.
రాత్రిపూట సిబ్బంది విధులు నిర్వర్తిస్తూ ఉంటారు. అయినప్పటికీ విద్యుత్ స్తంభాలకు ఒక్క లైట్ కూడా లేదు. సందర్శకులు ఇష్టానుసారం జలాశయం కట్టపై తిరుగుతూ సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టకుండా అధికారులు అలసత్వం వహిస్తున్నారు. ప్రమాదాలు సంభవిస్తే తప్ప చర్యలు తీసుకునేలా కనిపించట్లేదు.
ఇదీ చదవండి: