వైకాపా నాయకుల వేధింపులు భరించలేక చిత్తూరు జిల్లాలో ఓ సంఘ మిత్ర ఆత్మహత్యకు యత్నించింది. పెద్దపంజాణి మండలం కోగిలేరులో 18 సంవత్సరాలుగా సంఘమిత్రగా పనిచేస్తున్న ఆదెమ్మ పురుగుల మందు తాగింది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వైకాపా నాయకులకు సహకరించలేదని ఆరోపణలతో తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, కొంతకాలంగా ఆదెమ్మ ఆవేదన వ్యక్తం చేస్తోందని సహచర సంఘ మిత్రలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆదెమ్మ లంచం తీసుకుంటోందని గ్రామంలో ఆరోపణలు రావటంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె గ్రామంలో సమావేశం జరుగుతుండగానే పురుగుల మందు తాగింది. హుటాహుటిన అప్రమత్తమైన సహచర సంఘ మిత్రలు ఆమెను పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైకాపా మద్దతిచ్చిన నాయకులకు అనుకూలంగా పని చేయలేదనే ఆదెమ్మపై స్థానిక నాయకులు వేధింపులకు దిగుతున్నారంటూ తోటి సంఘ మిత్రలు ఆరోపిస్తున్నారు.
![వైకాపా వేధింపులు భరించలేక సంఘ మిత్ర ఆత్మహత్యాయత్నం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/ap-tpt-08-09-sangha-mitra-sucide-attempt-ycp-harassment-avb-3181980_09032021145649_0903f_1615282009_720.jpg)
ఇవీ చదవండి