ETV Bharat / state

చంద్రగిరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సదరం ప్రారంభం - వైకల్య నిర్దారణ ధ్రువపత్రాల తాజా న్యూస్

గతంలో "సదరం" పథకం ద్వారా వికలాంగులకు పలు విధాలుగా ఉపయోగపడే వైకల్య నిర్దారణ ధ్రువపత్రాలను డాక్టర్ల వద్ద పొందడానికి కనీసం మూడు నెలలు పట్టేది. కానీ ఇప్పుడు రోజులలోనే సదరం ధ్రువపత్రాలు అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా చంద్రగిరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వికలాంగులను డాక్టర్లు పరీక్షించారు.

http://10.10.50.85:6060///finalout4/andhra-pradesh-nle/finalout/16-December-2019/5392216_chadragiri.mp4
చంద్రగిరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సదరం ప్రారంభం
author img

By

Published : Dec 17, 2019, 8:10 AM IST

చంద్రగిరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సదరం ప్రారంభం

చిత్తూరు జిల్లా చంద్రగిరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో కొత్తగా పింఛను కోసం దరఖాస్తు చేసుకున్న వికలాంగుల కోసం సదరం వైద్య శిబిరం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్టు హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రవికుమార్ తెలిపారు. వారంలో ప్రతి సోమవారం వయస్సుతో సంబంధం లేకుండా కనీసం 40 శాతం వైకల్యం కలిగిన వికలాంగులకు సదరం ధ్రువపత్రాలను అందజేయడం జరుగుతుందన్నారు. శిబిరంలో పరీక్షలు చేసుకునేందుకు మీసేవా ద్వారా టైమ్ స్లాట్ బుక్ చేసుకోవాలని వికలాంగులను కోరారు. సోమవారం ఏరియా ఆసుపత్రిలో నిర్వహించిన శిబిరానికి నలుగురు దరఖాస్తు చేసుకున్నారు. వీరిని పరీక్షించి ధ్రువపత్రాలను మంజూరు చేస్తామని అన్నారు. అర్హులైన వారందరికీ వీలైనంత వేగంగా సర్టిఫికెట్లు ఇవ్వడమే సదరం పథకం ఉద్దేశ్యమని రవికుమార్​ పేర్కొన్నారు.

ఇదీ చూడండి: ఉదయగిరిలో సదరం శిబిరం ప్రారంభం

Intro:వికలాంగులకు చేరువుగా సదరం సేవలు.....Body:Ap_tpt_39_16_sadaram_cheruva_av_ap10100

గతంలో "సదరం" పథకం ద్వారా వికలాంగులకు పలు విధాలుగా ఉపయోగపడే వైకల్య నిర్దారణ ధ్రువపత్రాలను డాక్టర్ల వద్ద పొందడానికి కనీసం మూడు నెలలు పట్టేది.కానీ ఇప్పుడు రోజులలోనే సదరం ధ్రువపత్రాలు అందించే దిశగా ప్రభుత్వo చర్యలు తీసుకొంటుంది. అందులోభాగంగా చంద్రగిరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వికలాంగులను డాక్టర్లు పరీక్షించారు.
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కొత్తగా ఫించను కోసం దరఖాస్తు చేసుకున్న వికలాంగుల కోసం సదరం వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నామని హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రవికుమార్ తెలిపారు.వారంలో ప్రతి సోమవారం వయస్సుతో సంబంధం లేకుండా కనీసం 40 శాతం వైకల్యం కలిగిన వికలాంగులకు సదరం సర్టిఫికెట్స్ ను అందజేయడం జరుగుతుందని డాక్టర్ రవికుమార్ అన్నారు.సదరం శిబిరంలో పరీక్షలు చేసుకునేందుకు మీసేవా ద్వారా టైమ్ స్లాట్ బుక్ చేసుకోవాలని వికలాంగులను కోరారు. సోమవారం ఏరియా ఆసుపత్రిలో నిర్వహించిన శిబిరానికి నలుగురు దరఖాస్తు చేసుకున్నారు. వీరిని పరీక్షించి సర్టిఫికెట్స్ మంజూరు చేస్తామని అన్నారు.అర్హులైన వారందరికీ వీలైనంత వేగంగా సర్టిఫికెట్లు ఇవ్వడమే సదరం పథకం ఉద్దేశ్యమని ఆయన పేర్కొన్నారు.
Conclusion:పి.రవికిషోర్, చంద్రగిరి.9985555813.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.