చిత్తూరు జిల్లా పీలేరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందారు. పీలేరు-కలకడ రహదారిలో మహల్ క్రాస్ వద్ద ఆర్టీసీ బస్సు, కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. మృతులు కడప జిల్లా రాయచోటి, కొత్తపల్లెకు చెందిన అహ్మద్ ఫరీద్ కుటుంబ సభ్యులుగా గుర్తించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.
ఇదీ చదవండి