చిత్తూరు జిల్లా పలమనేరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రకాశం జిల్లా కందుకూరు నుంచి బెంగళూరు వెళ్తున్న కారు పలమనేరు వద్ద వంతెన పైనుంచి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ మృతి చెందగా.. మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గురైన వారి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి