చిత్తూరు జిల్లా బూచినాయుడు కండ్రిగ మండలం పదోమైలు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. శ్రీకాళహస్తి నుంచి వస్తున్న ఆటోను కారు ఢీ కొట్టింది. ఆటో డ్రైవర్ బందువు చింత కేశవులు అక్కడికక్కడే మృతిచెందాడు. గాయపడ్డ వారిని శ్రీకాళహస్తి ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి:సిలిండర్ పేలి కుప్పకూలిన భవనం- 10 మంది మృతి